calender_icon.png 3 March, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయప్రద సోదరుడి మృతి

01-03-2025 12:00:00 AM

ప్రముఖ నటి, మాజీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యురాలు జయప్రద సోదరుడు రాజబాబు (65) గురువారం మృతిచెందారు. ఈ విషయాన్ని జయప్రద తానే స్వయంగా వెల్లడించారు. ‘నా అన్నయ్య రాజబాబు మరణవార్త మీకు తెలియజేస్తు న్నందుకు బాధగా ఉంది. ఫిబ్రవరి ౨౭న మధ్యాహ్నం ౩.౨౬ గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు’ అని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందు తూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. న టుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు సుపరిచితుడు. ‘రాజమండ్రి రోమియోలు’, ‘బోరింగ్ పాప వంటి చిత్రాల్లో హీరోగా నటించి, నిర్మించారు.