calender_icon.png 21 April, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న జయపాల్‌రెడ్డి అన్న ప్రసాదం

15-04-2025 01:30:20 AM

కరీంనగర్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ స్వాముల బిక్ష  ఐదవ రోజుకు చేరింది. కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న స్వాములు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

కొత్తపల్లిలోని జయపాల్ రెడ్డి ఫామ్ హౌజ్ లో డి సపంత్ కూతురు డాక్టర్ నేహారెడ్డి, శిరీష అన్నదాతగా వ్యవహరించగా... పలువురు ఆంజనేయ స్వామి దీక్షాపరులు, ఆంజనేయ భక్తులు హాజరయ్యారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. దాదాపు 300 మంది ఆంజనేయ స్వాములకు గురుస్వామి డి సంపత్ ఆధ్వర్యంలో అన్నప్రసాదాన్ని అందజేశారు.

పది మంది మహిళా సేవకులు  హాజరై... సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ తోపాటు హనుమాన్ దీక్షాపరులు శంకర్, దశరథ్ రెడ్డి, ఎల్కపల్లి కొంరయ్య, మల్లేషం, కుమార్, రవి, సంద అశోక్, మనోజ్ కుమార్, పుస్తకాల ప్రవీణ్, కలారి సుధాకర్, శ్రీనివాస్ పటేల్,  విజయ్ గౌడ్, గోవింద సేవా భక్తులు శారద, విజయ, రమ, సునీత, మహిళా సేవకులు, తదితరులు పాల్గొన్నారు.