మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్(Singareni Collieries) మణుగూరు ఏరియా జయం దుర్గం రామచందర్ కు సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ అధికారిగా నియమించనున్నారని ఏరియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు గురువారం వాట్సాప్ సోషల్ మీడియా గ్రూపుల్లో మెసేజీలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ సెక్రటేరియట్ లో చర్చలు కొనసాగుతున్నట్లు, ఈ రోజు రాత్రికి డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు ఏరియా సింగరేణి చర్చించుకుంటున్నారు.