26-03-2025 12:10:31 AM
లయన్ డాక్టర్ సాయివెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో సాయివెంకట్ మాట్లాడుతూ.. “వేంకటేశ్వర స్వామికే గురువు లాంటి వారు రామానుజులు. వేంకటేశ్వరుడికి శంఖుచక్రాలు రామానుజాచార్యుల వారే బహూకరించారు. తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియజేసే ప్రయత్నంలోనే ఈ చిత్రాన్ని రూపొందించాం.
కమల్‌హాసన్ సామాజిక చిత్రంలో దశావతారాల్లో కనిపించారు. కానీ పౌరాణికంలో ఎవరూ 11 పాత్రల్లో నటించలేదు. ‘జయహో రామానుజ’తో నేను ఆ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నా” అని తెలిపారు. నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ.. “నాన్న (లయన్ డాక్టర్ సాయివెంకట్) ప్రోత్సాహంతోనే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నా. క్వాలిటీ కోసం టైమ్ తీసుకోవడం మంచిదే. అలాంటి కారణాలతోనే రాజమౌళి సినిమాలు కూడా రిలీజ్ వాయిదా పడుతుంటా యి.
భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా చిత్రాన్ని నిర్మిం చాం” అని చెప్పారు. సింగర్ పద్మ మాట్లాడుతూ.. “సింగర్ కావాలనే నా కల ఈ చిత్రం తో తీరింది” అని తెలిపారు. ‘పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారంటే ఇది చిన్న సినిమా అనకూడదు’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ అన్నారు.