22-03-2025 05:58:40 PM
కోదాడ,(విజయక్రాంతి): యూనిఫైడ్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ లో పట్టణంలోని జయ ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్ నుండి 17 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. తమ విద్యార్థులు కీర్తి, హృతిక్ వర్మ, రితిక్ రెడ్డి, తేజస్విని, జాహిద్, నందు, జశ్విత, వంశిక, ఆరాధ్య, నౌహియ ఫర్దస్ ఖాన్, ఇంతియాజ్, శ్రీచరణ్, మిన్హజ్, వికాస్, లలితాదిత్య, అబ్దుల్ ముసావ్విర్, అక్షయ్ లు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి, ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు అభినందించారు.