లుసాన్నే: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షా మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) అధ్యక్షు డు థామస్ బాచ్‌తో భేటీ అయ్యాడు. లుసాన్నేలోని ఒలింపిక్స్ హౌస్‌లో లాస్ ఏంజెలెస్ 2028 ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్ సెమినార్ జరిగింది.
ఈ సెమినార్‌లో పాల్గొన్న జై షా 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ నిర్వహణపై చర్చించారు. గతేడాది డిసెంబర్‌లో ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ సిరీస్ సందర్భంగా 2032 బ్రిస్బేన్ ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీతోనూ భేటీ అయ్యారు. చివరగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించారు.