అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
దుబాయ్: ఐసీసీ కొత్త చైర్మన్‌గా ప్రస్తుత బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న అత్యంత పిన్న వయస్కుడిగా జై షా (35)రికార్డులకెక్కనున్నాడు. డిసెంబర్ 1 నుంచి జై షా ఐసీసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నాడు. రెండేళ్ల పాటు షా ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన బార్ క్లే చైర్మన్‌గా ఉన్నారు.
మరోమారు ఈ పదవి చేపట్టేందుకు బార్క్ లే విముఖత చూపడంతో జై షాను ఈ పదవి వరించింది. భారత్ తరఫున ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన ఐదో వ్యక్తిగా జై షా నిలిచాడు. షా కంటే ముందు జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఈ పదవిలో కొనసాగారు. కాగా జై షా 2019 నుంచి బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
బీసీసీఐ కార్యదర్శిగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు పెంచడం నుంచి మహిళా క్రికెటర్లకు సమాన పారితోషికాలు, జాతీయ జట్టులో చోటు దక్కాలంటే దేశవాళీలో ఆడాల్సిందేనంటూ కఠిన నిర్ణయాలు తీసుకుడ న్నారు. ఐసీసీకి అధిక ఆదాయం బీసీసీఐ నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్‌గా జై షా ఎన్నిక లాంచనంగా మారింది. జై షా స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.