మంథని (విజయక్రాంతి): మంథని క్యాంప్ కార్యాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు భారత తొలి ప్రధాని పండిట్ జోహార్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పెండ్రూ రమ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ మాట్లాడుతూ.. పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశ స్వతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి అనేక రోజులు జైలు జీవితాన్ని గడిపాడని, దేశ స్వతంత్రం తర్వాత భారత దేశ తొలి ప్రధానిగా పదవి చేపట్టి భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసం, ఈ దేశ ప్రజలకు విద్య వైద్యం అందించడం కోసం వారు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.
ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు నమ్మి అనేక ప్రాజెక్టులు నిర్మించి జాతికి అంకితం చేసిన మహా నాయకుడు నెహ్రూ అని కొనియాడారు. దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఇల్లు మరియు విద్యా వ్యవస్థ ను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారన్నారు. దీన్ని స్ఫూర్తిగా నవంబర్ 14న బాలల దినోత్సవన్ని ప్రజలు జరుపుకుంటారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుడుదుల వెంకన్న, బూడిద శంకర్, ముసుకుల సురేందర్ రెడ్డి, పెరవెన లింగయ్య, సాదుల శ్రీకాంత్, జనగామ సడవలి, మబ్బు తిరుపతి, మంథని సురేష్, బూడిద రమేష్ రంజిత్, అర్ల వికిల్, ఆగే రమేష్, పర్వతాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.