calender_icon.png 21 November, 2024 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం మరువని దార్శనికుడు జవహర్ లాల్ నెహ్రూ

14-11-2024 12:25:50 PM

నీలం మధు ముదిరాజ్

పటాన్చెరు: భారతదేశ తొలి ప్రధానిగా, రాజనీతిజ్ఞుడుగా దేశ అభివృద్ధికి పునాదివేసిన దేశం మరువని దార్శనికుడు పండిట్ జవహర్ లాల్  నెహ్రూ అని మెదక్ పార్లమెంట్  కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పండిత్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం చిట్కుల్లోని నీలం మధు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిన భారత దేశ తొలి ప్రధానిగా దేశాన్ని అన్ని రంగాల్లో మహోజ్వల ప్రగతి సాధించేలా పాలన కొనసాగించారన్నారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించి ఆధునిక భారతం అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా కృషి చేశారని కొనియాడారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూ ను చిన్నారులంతా ముద్దుగా చాచా నెహ్రు అని సంబోధిస్తారని ఆ మహానేత జన్మదినాన్ని బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆ మహనీయుడు నెహ్రూ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు.