- మార్కెట్లోకి 42 ఎఫ్‌జే మోటార్‌సైకిల్
- ప్రారంభ ధర రూ.1,99,142
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: జావా కొత్త మోడల్ 42ఎఫ్‌జే బైక్‌ను మహీంద్రా గ్రూప్ సంస్థ ప్రీమియం మోటార్‌సైకిళ్ల సంస్థ క్లాసిక్ లెజెండ్స్ మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1,99, 942 (ఎక్స్ షోరూమ్). జావా బ్రాండ్‌పై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీం ద్రా వ్యాఖ్యానిస్తూ తాము క్లాసిక్ లెజెండ్స్ ద్వారా చరిత్రాత్మక బ్రాండ్లను పునరుత్తానం చేస్తున్నామని చెప్పారు. ఇండియాలో, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో జావా బ్రాండ్‌నేమ్‌తో బైక్‌లను విడుదల చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా తన సబ్సిడరీ క్లాసిక్ లెజెండ్స్ ద్వారా 2016లో ఒక లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఐదు రంగుల్లో..
334 సీసీ ఇంజిన్, సిక్స్‌గేర్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఈ మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 350తో పోటీపడుతుందని అంచనా. పండు గ సీజన్‌లోపు దేశవ్యాప్తంగా 100 కొత్త స్టోర్స్‌ను తెరవాలని భావిస్తున్నట్టు క్లాసిక్ లెజెండ్స్ తెలిపింది. 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్‌తో కూడిన స్టీల్ ఛాసిస్‌ను, ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌ను అమర్చారు. జావా 42 ఎఫ్‌జే 350 ఐదు రంగుల్లో లభిస్తుంది. వీటి ధరల శ్రేణి రూ.2.20 లక్షల వరకూ ఉంది.