బెంగళూరు: ఐటీఎఫ్ కలాబురగై టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు దేవ్ జావియా పోరాడి ఓడిపోయా డు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో దేవ్ జావియా 6-7 (5/7), 2-6తో ఉజ్బెకిస్థాన్‌కు చెంది న కుమొయున్ సుల్తనోవ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో సుల్తనోవ్ రష్యాకు చెందిన బొబ్రోవ్తో తలపడనున్నా డు. ఇక డబుల్స్‌లో భారత్‌కు చెందిన నితిన్ కుమార్- నిక్ చాపెల్ (అమెరికా) జోడీ కూడా సెమీస్‌లో వెనుది రిగింది. ఈ జోడీ రష్యాకు చెందిన ఇగోర్ అగఫొనోవ్- బొబ్రోవ్ జంట చేతిలో ఓటమి చవిచూసింది.