calender_icon.png 26 February, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాట్ డబ్బింగ్ షురూ

20-02-2025 12:00:00 AM

సన్నీ డియోల్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన ‘జాట్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై డైనమిక్  ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ని మేకర్స్ ప్రారంభించారు. ఇప్పటికే ‘జాట్’ టీజర్ అందరినీ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్,  రెజీనా కాసాండ్రా కీలక పాత్రలు పోహిస్తున్నారు. ‘జాట్’ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.