calender_icon.png 9 January, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జాతస్య మరణం ధ్రువం’

03-01-2025 12:19:30 AM

జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఈ సినిమాతో ప్రీతీ జంఘియానీ రీఎంట్రీ ఇస్తోంది. శ్రవణ్ జొన్నాడ రచనాదర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్రిష సమర్పణలో సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ‘పుట్టినవారికి మరణం తప్పదు’ అనే అర్థంతో సంస్కృత పదబంధం నుంచి రూపొందిన యూనిక్ టైటిల్ ఇది. గురువారం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, రాజ్ ఆషూ; డీవోపీ-: అర్జున్ రాజా; ఎడిటర్-: విప్లవ్ నైషధం; ఆర్ట్: రాజేశ్ మందాపురం; స్టంట్స్-: పృథ్వీ, వెంకట్; సాహిత్యం-: సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల రవికుమార్, కేకే.