బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా వికెట్ల వేట మొదలు పెట్టాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ(10)ని బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేశాడు. మ్యాచులో బుమ్రా వేట కొనసాగుతోంది. ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(08)ను బుమ్రా ఔట్ చేశారు. బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి ఖవాజా స్లిప్ లో విరాట్ కోహ్లీకి చిక్కి వికెట్ కోల్పోయాడు. 19 పరుగులకే ఆసీస్ మూడో వికెట్ చేజార్చుకుంది. ఉస్మాన్ ఔట్ కావడంతో క్రీజులోకి అడుగుపెట్టిన స్టీవ్ స్మిత్(0)ను తొలి బంతికే బుమ్రా ఎల్బీ చేశాడు. దీంతో కనీసం డీఆర్ఎస్ తీసుకోకుండానే స్మిత్ పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ వచ్చాడు. ఆస్ట్రేలియా 8.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(01), మార్నస్ లబుషేన్(0) ఉన్నారు.