calender_icon.png 25 October, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిక్వార్టర్స్‌లో జాస్మిన్

06-07-2024 12:06:06 AM

ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో జాస్మిన్ పవోలిని ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బియాంక ఆండ్రెస్కూతో జరిగిన హోరాహోరీ పోరులో సత్తాచాటిన జాస్మిన్ ముందంజ వేయగా.. పురుషుల సింగిల్స్‌లో మూడోసీడ్ అల్కరాజ్ చెమటోడ్చి ముందంజ వేశాడు. వెటరన్ ప్లేయర్ ఆండీ ముర్రే డబుల్స్‌లో ఓడి వింబుల్డన్‌కు టాటా చెప్పాడు. 

అల్కరాజ్, దిమిత్రోవ్ ముందంజ n వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్

లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో జాస్మిన్ పవోలిని (ఇటలీ) ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో జాస్మిన్ 7 (7/4), 6 బియాంక ఆండ్రెస్కూ (కెనడా)పై గెలిచి ముందంజ వేసింది. తొలి సెట్‌లో హోరాహోరీగా పోరాడిన ఆండ్రెస్కూ.. రెండో సెట్‌లో కనీస ప్రతిఘటన కనబర్చకుండానే చేతులెత్తేసింది. మ్యాచ్ మొత్తంలో ఆండ్రెస్కూ 3 ఏస్‌లు కొట్టగా.. జాస్మిన్ ఒక ఏస్ మాత్రమే సంధించింది. అయితే బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో చెలరేగిపోయిన ఇటలీ చిన్నది.. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఇతర మ్యాచ్‌ల్లో మ్యాడిసన్ కీస్ 6 6 కోస్త్యుక్‌పై, బడోసా 7 (8/6), 4 6 కసత్‌కినాపై, నవారో 2 6 6 ష్నైడర్‌పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మూడోసీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మూడోరౌండ్‌లో అల్కరాజ్ 5 6 4 7 (7/2), 6 టియాఫోపై విజయం సాధించాడు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన రసవత్తర సమరంలో 16 ఏస్‌లు కొట్టిన అల్కరాజ్.. 55 విన్నర్లతో సత్తాచాటాడు. ఇతర మ్యాచ్‌ల్లో దిమిత్రోవ్ 6 6 6 మోన్‌ఫిల్స్‌పై, పాల్ 6 6 6 బబ్లిక్‌పై గెలిచి ముందంజ వేశారు. 

ముర్రే వీడ్కోలు..

ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ ఆండీ ముర్రే వింబుల్డన్‌కు గుడ్‌బై చెప్పాడు. పురుషుల డబుల్స్‌లో సోదరుడు జెమీ ముర్రేతో కలిసి బరిలోకి దిగిన ఆండీ.. తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. రెండుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆండీ ముర్రేకు.. అభిమానుల స్టాండింగ్ ఒవేషన్‌తో వీడ్కోలు పలకగా.. దిగ్గజ ప్లేయర్లు ఫెదరర్, నాదల్, వీనస్ విలియమ్స్.. ముర్రేకు వీడియో సందేశాలు పంపారు.