- అల్కరాజ్, సిన్నెర్ ముందంజ
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో జాస్మిన్ పవోలిని క్వార్టర్స్‌కు చేరింది. ఏడోసీడ్‌గా బరిలోకి దిగిన జాస్మిన్ ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 6 6 (6/8), 5 ఉన్న సమయంలో ప్రత్యర్థి మాడిసన్ కీస్ (అమెరికా) గాయం కారణంగా తప్పుకుంది. తొలి సెట్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన జాస్మిన్‌కు రెండో రౌండ్‌లో కీస్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. అయితే మూడో సెట్‌లో ఇద్దరు సమ ఉజ్జీలుగా కనిపించిన దశలో గాయం మాడిసన్ అవకాశాలను దెబ్బతీసింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్, టాప్ సీడ్ జానిక్ సిన్నెర్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.
ఆదివారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6 6 1 7 హంబర్ట్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా.. ప్రపంచ నంబర్‌వన్ సిన్నెర్ 6 6 7 (11/9)తో షెల్టన్ (అమెరికా)ను చిత్తుచేశాడు. హంబర్ట్‌తో పోరులో 14 ఏస్‌లు కొట్టిన అల్కరాజ్.. ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. సిన్నెర్‌తో మ్యాచ్‌లో 15 ఏస్‌లు సంధించిన షెల్టన్ 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఒక్క డబుల్ ఫాల్ట్‌కూడా చేయని సిన్నెర్ 28 విన్నర్లతో ముందంజ వేశాడు.