calender_icon.png 31 October, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జరూరత్ సే జ్యాదా..

11-08-2024 12:05:00 AM

బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నటిస్తున్న తాజా చిత్రం ‘వేదా’. తమన్నా భాటియా, శార్వరీ వాఘ్ కథానాయికలు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది.

తాజాగా ‘జరూరత్ సే జ్యాదా’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘నువ్వేలే నువ్వేలే..’ పేరుతో ఈ సాంగ్ తెలుగు వెర్షన్‌నూ అందుబాటులో ఉంది. ‘నువ్వేలే నువ్వేలే.. గుండెల్లో ఉన్నావే.. నీతోనే నిండేనే జగం..’ అంటూ సాగుతున్న ఈ పాటకు సాహిత్యం హిందీలో కునాల్ వర్మ, తెలుగు యనమండ్ర రామకృష్ణ అందించారు. అమల్ మాలిక్ స్వరపరిచిన ఈ పాటను గాయకుడు బాలాజీ శ్రీ ఆలపించారు.