calender_icon.png 16 January, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ గాళ్లతో జర పైలం

11-07-2024 01:54:42 AM

టీజీఎస్ ఆర్టీసీ

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3,035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కోవాలంటూ కొన్ని లింక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని సంస్థ తెలిపింది. అవన్నీ ఫేక్ వెబ్ సైట్లని సంస్థ వెల్లడించింది. ఆ లింకులను ఉద్యోగార్థులు నమ్మొద్దని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.