జొహొర్: మలేషియా వేదికగా జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్‌లో భారత పురుషుల జూనియర్ హాకీ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 జపాన్‌ను మట్టికరిపించింది. భారత్ తరఫున అమిర్ అలీ (ఆట 12వ నిమిషం), గర్జోత్ సింగ్ (36 ని.లో), ఆనంద్ సౌరబ్ (44 ని.లో), అంకిత్ పాల్ (47 ని.లో) గోల్స్ చేశారు.
ఇక జపాన్ తరఫున సుబాసా (26 ని.లో), యమనకా (57 ని.లో) గోల్స్ సాధించారు. కాగా మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు కోచ్‌గా ఇదే తొలి టోర్నీ కావడం విశేషం. తొలి మూడు క్వార్టర్స్‌లోనే మన ఆటగాళ్లు నాలుగు గోల్స్‌తో మెరిసి భారత్‌ను స్పష్టమైన ఆధిక్యంలో నిలిపారు. భారత్ తర్వాతి మ్యాచ్‌ను నేడు బ్రిటన్‌తో ఆడనుంది.