calender_icon.png 19 January, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జపాన్‌దే బ్రేక్‌డ్యాన్స్

11-08-2024 02:48:21 AM

పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్రేక్ డ్యాన్స్ ఈవెంట్‌లో మహిళల విభాగం నుంచి జపాన్ డ్యాన్సర్ అమి యాసా తొలి స్వర్ణం సొంతం చేసుకుంది. లుథియానాకు చెందిన డొమినికా బెన్విక్, చైనా డ్యాన్స ర్ లియు కింగీ వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. బ్రేకింగ్ ఈవెంట్‌లో మొత్తం 16 మంది డ్యాన్సర్లు పాల్గొనగా.. రెండు గ్రూపులుగా విభజించారు. బ్రేకింగ్‌లో లాంగ్ డే ఫ్లో, రిథమ్, స్కిల్ ఎట్ ప్లేస్ రౌండ్లలో టాప్ ప్రదర్శన కనబరిచిన అమి, డొమినికాలు ఫైనల్లో తలపడ్డారు. ఈ సందర్భంగా డ్యాన్సర్లు హెడ్‌స్పిన్స్, విండ్ మిల్స్, బ్యాక్ ఫ్లిప్స్‌తో అభిమానులను అలరించారు. చైనా డ్యాన్సర్ లియు, నెదర్లాండ్స్‌కు చెందిన ఇండియా సర్డ్‌జో మధ్య కాంస్య పతక పోరు జరగ్గా.. లియు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో నేడు బ్రేక్‌డ్యాన్స్ ఫైనల్ జరగనుంది.