28-08-2024 01:05:44 AM
ఫిరంగి నాలా కొలతలు తీసుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు నివేదిక
మరోసారి సర్వే చేస్తామన్న అధికారులు
సలకం చెరువు ఆక్రమణలపై హైడ్రా నజర్
చేవెళ్ల, ఆగస్టు 27 (విజయక్రాంతి) : జన్వాడ ఫాంహౌస్‌పై హైడ్రా గురిపెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. శంకర్‌పల్లి తహసీల్దార్ ఆదేశాల మేరకు సర్వే చేసినట్లు శంకర్‌పల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి, ఇరిగేషన్ అధికారి లింగం మీడియాకు తెలిపారు. ఫిరంగి నాలాను ఆక్రమించారనే ఆరోపణల నేపథ్యంలో నాలాకు సంబంధించి కొలతలు తీసుకున్నామని వారు చెప్పారు.
ఇందులోకి ఏఏ సర్వే నెంబర్లు వస్తున్నాయనే వివరాలను సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని, ఈ ప్రాంతంలో సమగ్ర భూసర్వే తర్వాత ఫిరంగి నాలా ఎంత మేరకు ఆక్రమణకు గురైందో తెలుస్తుందని అన్నారు. ఈ సర్వే రిపోర్టును తమ ఉన్నతాధికారులతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అందిస్తామని వారు తెలిపారు.
అయితే ఉస్మాన్‌సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియాలో భాగంగా విస్తరించిన ఉన్న ఫిరంగినాలాను ఆక్రమించి జన్వాడ ఫాంహౌస్‌ను నిర్మించారని, దాని కూల్చివేతకు సంబంధించి ఇటీవల స్థానిక అధికారు లు జారీచేసిన నోటీసులపై కేటీఆర్ స్నేహితు డు ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కొద్ది రోజుల కిందట కేటీఆర్ స్పంది స్తూ, ఆ ఫాంహౌస్ తనది కాదని, తన మిత్రు డు ప్రదీప్ రెడ్డి వద్ద లీజుకు తీసుకున్నానని, ఇది అక్రమం అని తేలితే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని చెప్పిన సంగతి విధితమే.
ఫిరంగి నాలా అక్రమించినట్లుగా నిర్ధారణ
111 జీవో పరిధిలోని ఉస్మాన్‌సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియాలో జన్వాడ ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఇక్కడి నుంచి ఫిరంగి నాలా శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్ నుంచి మోకిలా, గోపులారం నుంచి మణికొండ వైపు వెళ్తుంది. వాస్తవానికి ఫిరంగి నాలాకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. కానీ, కేటీఆర్ మిత్రుడికి చెందిన ఫాంహౌస్ ఏకంగా 40 ఫీట్లు కబ్జా చేసి, కాంపౌండ్ వాల్ కట్టి గేట్ పెట్టినట్లు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
గతంలోను అనేక ఫిర్యాదులు రావడంతో ఈ ఫాంహౌస్‌పై అనుమతి లేకుండా పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేశారు. దీంతో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయడంతో పాటు 14 రోజులు జైలుకు వెళ్లాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అధికారుల సర్వేతో జన్వాడ ఫాంహౌస్ వద్ద మళ్లీ అలజడి మొదలైంది. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండ టంతో అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. బీఆర్‌ఎస్ నేతలు జన్వాడకు తరలివచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
సలకం చెరువు ఆక్రమణలు
హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండల పరిధిలోని సలకం చెరువుపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం సలకం చెరువు పరిసర ప్రాం తాలను గుర్తించి చెరువు స్థలం మేరకు ఆక్రమించి ఓవైసీ బ్రదర్స్‌కు చెందిన ఫాతిమా విద్యాసంస్థలను నిర్మించారని ప్రాథమికం గా గుర్తించిన అధికారులు అందుకు సంబంధించిన క్యాడస్ట్రల్ మ్యాపులను అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలోనే ఓవైసీ బద్రర్స్‌కు సంబంధించిన ఫాతిమా విద్యా సంస్థ లకు సంబంధించిన భవనాలను కూల్చివేస్తారని ప్రచారం జరుగుతుంది.
ఫాతిమా విద్యా సంస్థలను స్థాపించి కేజీ టూ పీజీ పేరుతో ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అయితే ఈ విద్యాసంస్థలను సలకం చెరువులోని సుమా రు 12 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి నిర్మించినట్లుగా హైడ్రా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటో లు, చెరువు మ్యాపులు, అధికారుల సందర్శనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కానీ హైడ్రా అధికారులు మాత్రం దీనిపై ఎలాం టి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.