calender_icon.png 28 February, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపరిశుభ్రతకు నిలయం జాన్‌పహాడ్ రోడ్డు!

28-02-2025 01:28:43 AM

మఠంపల్లి : సూర్యపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రము నుండి జాన్ పహాడ్ రోడ్డు అపరిశుభ్రతకు నిలయం అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మఠంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న చికెన్ సెంటర్, కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, టీఫిన్ సెంటర్, పండ్ల మార్కెట్, జ్యూస్ సెంటర్ లో ఉన్న వ్యర్థ పదార్థాలను జాన్ పహాడ్ రోడ్డులో ఉన్న తీగల చెరువును అనుకొని మెయిన్ రోడ్డులో దాదాపుగా 100 మీటర్లు మేర వ్యర్థ పదార్థాలను పారేయడం వల్లన ఈ రోడ్డులో వస్తున్న ప్రజలు, ప్రయాణికులు గబ్బు వాసనతో,

ఆ వ్యర్థ పదార్థాలను తీయడానికి వస్తున్న కుక్కల వల్ల తీవ్ర ఇబ్బందికి గురౌతున్నారని,గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డు ఉన్న వ్యాపారస్తులు జన సంచారం ఉన్న రోడ్డు లో ఎందుకు వేస్తున్నారని ప్రజలు, వ్యవసాయ పనులకు వేళ్ళుతున్న రైతులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు సమా చారం అందించిన,

ఈ రోడ్డు నుండి ఎంతో మంది అధికారులు, నాయకులు ప్రయాణించిన ఎలాంటి మార్పు లేదని, ఈ వ్యర్థ పదార్థాల వాసనా వల్ల, వాటి నుంచి వచ్చే దోమల వల్ల అనేక రోగాలకు ప్రజలు గురౌతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పం దించి ఈ రోడ్డులో వ్యర్థ పదార్థాలను పారేయకుండ చూడాలని  కోరుతున్నారు.