21-03-2025 06:21:54 PM
చిట్యాల,(విజయక్రాంతి): అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన జన్నే యుగేందర్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షులుగా బొట్ల ఆనందం, గుర్రపు అశోక్, ప్రధాన కార్యదర్శిగా పుల్ల ప్రతాప్, సహాయ కార్యదర్శులు దాసారపు నరేష్, బొనగిరి తిరుపతి, కోశాధికారి కనకం తిరుపతి, సునీల్, రాజు నాయక్, ప్రచార కార్యదర్శులు కట్కూరి రాజు, కట్కూరి రాజేందర్, కార్యవర్గ సభ్యులు శీలపాక ప్రణిత్, అంబాల సాంబయ్య, ముఖ్య సలహదారులు సరిగొమ్ముల రాజేందర్, గుర్రపు రాజ మొగిలి, కట్కూరి రమేష్, బొడ్డు ప్రభాకర్, ఇక క్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన ఏవైఎస్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.