calender_icon.png 13 March, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు

13-03-2025 01:26:11 PM

హైదరాబాద్: భారతీయ రైల్వే శాఖ గురువారం నాడు మరో కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నుంచి శిశాఖపట్నం- విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ చేసింది. ఏప్రిల్ 25 నుంచి ప్రతిరోజూ నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్(Janmabhoomi Express) సికింద్రాబాద్ స్టాప్ రద్దు అయింది. విశాఖ-లింగంపల్లి(Visakhapatnam and Lingampalli) విశాఖ జన్మభూమి ఎక్స్ ప్రెస్ ప్రయాణ మార్గం మళ్లించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలును ఇప్పుడు శాశ్వతంగా చర్లపల్లి-అమ్ముగూడ-సనత్‌నగర్ మీదుగా మళ్లిస్తారు. ఏప్రిల్ 25 న లింగపల్లి నుంచి చర్లపల్లి మీదగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్ విశాఖ రానుందని అధికారులు వెల్లడించారు.