పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోనీ కేటీపీఎస్ ప్రాంగణంలోని విద్యుత్ కళాభారతిలో జన్కో ఇంటర్ ప్రాజెక్ట్ హాకీ, బాస్కెట్ బాల్ పోటీలు జరిగాయి. పోటీలలో బిటిపిఎస్ మణుగూరు, కేటిపిపి, భూపాల్ పల్లి పాల్వంచ కేటీపీఎస్ ఏడవ దశ, కేటీపీఎస్ 5, 6 దశలలోని క్రీడాకారులు పాల్గొన్నారు. జరిగిన ఇంటర్ ప్రాజెక్ట్ బాస్కెట్ బాల్ పోటీలలో కేటీపీఎస్ 5 6 దశల జట్టు ఫైనల్ లో కేటీపీఎస్ ఏడవదశపై చాంపియన్స్ గా నిలిచింది. హాకీ విభాగంలో కేటీపీఎస్ 5, 6 దశలు భూపాలపల్లి జట్టుపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. విజయం సాధించిన విజేత జట్లకు గురువారం డైరెక్టర్ థర్మల్ లక్ష్మయ్య బహుమతులు ప్రధానం చేశారు. మ్యాచ్లకు రెఫ్రిల్ గా చీఫ్ ఇంజనీర్లు మోక్ష వీరు, వీరస్వామి, లోహిత ఆనంద్, రాజు, కట్ట శ్రీధర్, తోట అనిల్, ఇలియాస్, ఆరిఫ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో త్వరలో పదవి విరమణ పొందబోతున్న కేటిపిఎస్ 5,6 దశల చీఫ్ ఇంజనీర్ పాలకుర్తి వెంకటేశ్వరరావుకి ఘనంగా పదవి విరమణ శుభాకాంక్షలు క్రీడాకారులు తెలియజేశారు.