పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క
ఆదిలాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): జనవరి 2న కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లా కెరమెరి మండలం కోటపరండోలి గ్రామంలో ప్రారంభమయ్యే ఆదివా సీల ఆరాధ్య దైవం రాయితాడ్ జంగుబాయి ఉత్సవాలను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ప్రజా భవన్‌లో సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జంగుబాయి ఆలయ నిరహణ కమిటీ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులతో కలసి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పుష్యమాసాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు భక్తి శ్రద్ధలతో రాయితాడ్ జంగుబాయిని ఏటా దరించుకుంటారని తెలిపా రు.
ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జంగుబా యి ఆలయ చైర్మన్ శ్యాంరావు, గౌరవ అధ్యక్షుడు కొడప జాకు, సలహాదారులు మరప బాజీరావ్, సమనయకర్తలు తుమ్రం ప్రభ, వెట్టి భూమేష్, దొడంద మాజీ సర్పంచ్ తుమ్రం నాగు, రామారావ్ కటోడ, తుడుం దెబ్బ రాష్ర్ట నాయకుడు కొడప నగేశ్, పుర్క బాపురావ్, మల్కు పటేల్ పాల్గొన్నారు.