calender_icon.png 15 January, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగామ సిఐ, ఎస్ఐపై బదిలీ వేటు

08-08-2024 10:25:58 PM

జనగామ: న్యాయవాద దంపతులపై దాడి ఘటనలో జనగామ సిఐ, ఎస్సై పై బదిలీ వేటు పడింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జనగామ కోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న అమృత రావు దంపతులు తన క్లైంట్ కేసు  విషయంలో జనగామ సిఐ రఘుపతి రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సిఐతో కేసు విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో న్యాయవాద దంపతులపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. దీంతో జనగామ సిఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ తిరుపతిపై కేసు నమోదు అయింది. ఈ క్రమంలో జనగామ సిఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ తిరుపతిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ గురువారం రాత్రి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్జా ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ కరుణాకర్ ను ఏఆర్ కు అటాచ్ చేశారు. జనగామ సిఐగా సిసిఎస్ లో పుదితులు నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డిని నియమించారు.