14-03-2025 08:42:39 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): జనసేన పార్టీ ఆవిర్భవించి 11 ఏళ్లు పూర్తి చేసుకుని ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొని రెండు చోట్ల ఓడిపోయాయి. కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడినటువంటి కఠిన శ్రమ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కష్టానికి ఉమ్మడి రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఒక్కసారిగా జనసేన వైపు చూసే విధంగా పోటీ చేసిన 21 స్థానాల్లో పూర్తిగా విజయం సాధించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా టేకులపల్లి మండలం బోడు గ్రామ పంచాయతీలో శుక్రవారం జనసైనికులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ మాడే చంద్రశేఖర్, సభ అధ్యక్షులు వెలిశాల మహేష్, జనసేన కార్యకర్తలు పుణెం సాగర్, కాళ్ళ రాజా, కేగర్ల మణికంత్, మేకల సతీష్, మాడె శివప్రసాద్, జయశంకర్, మీనుగు ఉపేందర్, పునేం సందీప్ రాజ్, మెంతేన హేమంత్, మడే జగన్ ఒచ్చదేవర కుమార్ నల్లబోతు సతీష్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.