calender_icon.png 20 September, 2024 | 1:14 PM

జానీ మాస్టర్‌పై జనసేన చర్యలు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశం

16-09-2024 04:56:39 PM

హైదరాబాద్: జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ చర్యలు చర్యలు తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అత్యాచార ఆరోపణలు రావడంతో జనసేన చర్యలు తీసుకుంది. జాతీయ అవార్డు గ్రహీత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్  పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే, జనసేన సభ్యుడైన జానీ మాస్టర్‌పై చర్య తీసుకుంటారనే ప్రశ్నలు నడుమ జనసేన నిర్ణయం సంచలనంగా మారింది.

జనసేన పార్టీ సభ్యుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సీరియస్‌గా వ్యవహరించాలని పార్టీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌తో పాటు కొంతమంది నెటిజన్లు ఏపీలోని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జానీ మాస్టర్ పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరపున చురుగ్గా ప్రచారం చేశారు. మహిళ ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376, 506, 323 కింద కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పీఓఎస్‌హెచ్) కింద అంతర్గత విచారణ జరిపి పోలీసులతో కేసు నమోదు చేయాలని తెలంగాణ మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ శిఖా గోయెల్ చిత్ర పరిశ్రమకు సూచించారు.