calender_icon.png 16 January, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 నుంచి జనసేన సభ్యత్వ నమోదు

15-07-2024 12:05:00 AM

9 లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్

మంత్రి నాదెండ్ల మనోహర్

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 18 నుంచి నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవ న్ కళ్యాణ్  నిర్ణయించారు. మూడు నెల ల కిందటే పార్టీ సభ్యత్వ నమోదు గడువు ముగియడంతో ఎన్నికల ప్రక్రి య మధ్యలో పార్టీ శ్రేణులను గందరగోళ పరచకూడదనే ఉద్దేశ్యంతో మూ డు నెలల పాటు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా ఈ గడువు ముగియడంతో సభ్యత్వ నమోదుపై పార్టీ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో జనసేన క్రియా శీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వ హించారు. నమోదు ప్రక్రియ విధివిధానాలను వారికి తెలియజేశారు. జూలై 18 నుంచి నిర్వహించ నున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 9 లక్షల సభ్యత్వాలు నమో దు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగు ణంగా పార్టీ నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రణాళికాబద్ధంగా ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు.