17-03-2025 08:26:01 PM
కోదాడ (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా జల్లా జనార్దన్ రావును నియమిస్తూ సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు సోమవారం నియమక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా ఉపాధ్యక్షుడిగా జల్లా జనార్దన్ రావు మాట్లాడుతూ... తన నియామకానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కట్టమూరి ఉదయ్ కుమార్, నాగన్న, ఓరుగంటి పురుషోత్తం, ఉడతా విశ్వనాథం, గరి నే నాగేశ్వరరావు పాల్గొన్నారు.