calender_icon.png 13 October, 2024 | 8:52 PM

‘జనక అయితే గనక’ జంధ్యాల శైలిలో తీశా

09-10-2024 12:00:00 AM

సుహాస్, సంగీర్తన హీరోహీరోయిన్లుగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షితరెడ్డి నిర్మించారు. ఈ సినిమా  దసరా సందర్భంగా  అక్టోబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

‘జనక అయితే గనక’ టైటిల్ మీనింగే తండ్రి అయితే ఏంటి అని! ఇప్పటి జనరేషన్‌లో పెళ్లయిన కొత్త జంట ఓ పాపనో, బాబునో కనటానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులేంటి? అనే విషయాన్ని మధ్యతరగతి నేపథ్యంలో తీసుకుని సినిమాగా చిత్రీకరించాం. ఓ వ్యక్తి కండోమ్ కంపెనీపై కేసు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే ఈ కథ పుట్టింది.

జంధ్యాల స్టుల్లో చాలా హెల్దీ హ్యూమర్ సినిమాలో ఉంటుంది. ఓ రైటర్‌గా మన మూలాల్లోని ఎమోషన్స్‌ను చెప్పటానికి ఇష్టపడతా. షూటింగ్ సమయంలోనే సుహాస్ సతీమణి డెలివరీ జరిగింది. సినిమాలో భార్యాభర్తల మధ్య సన్నివేశాలు జరుగుతున్నప్పుడు, దానికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి చేశారు. ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు కలిగే ఫీలింగ్ ఈ సినిమా చూసినప్పుడు వస్తుంది” అని వివరించారు.