calender_icon.png 17 October, 2024 | 9:53 AM

‘జనక అయితే గనక’ నవ్వులే నవ్వులు

08-10-2024 12:00:00 AM

సుహాస్, సంగీర్తన హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ సినిమా దసరా సందర్భంగా జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది. ఆదివారం బందరులో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “జనక అయితే గనక’ ఈవెంట్‌ను బందరులో నిర్వహించడం ఆనందంగా ఉంది. బందరు ఎంతో మంది కళాకారుల్ని అందించింది” అని అన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సుహాస్ మీలో ఒకడిగా ఉండేవాడు.. మీ జిల్లా వాడు.

ఈ చిత్రం అందరినీ నవ్వించేలానే ఉంటుంది’ అని తెలిపారు. హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఈ మూవీతో డిస్ట్రిబ్యూటర్‌గా మారుతున్నా. ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా’ అని తెలిపారు. ‘ప్రభాస్ సలార్ సినిమాకు రైటర్‌గా పని చేశాను. ఆయన మా మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు’ అని డైరెక్టర్ సందీప్ బండ్ల తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ సంగీర్తన, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, చిత్రబృందం అంతా పాల్గొన్నారు.