calender_icon.png 19 March, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యం కోసం జనహిత సేవా సమితి ఆర్థిక సహాయం

18-03-2025 05:34:00 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అనారోగ్యంతో బాధపడుతున్న బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన కుదిరే సరిత వైద్యం కోసం ఆమె కుటుంబ సభ్యులకు మంగళవారం రూ 27 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ... బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన కుదిరే సరిత మెదడు వాపు వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు, చికిత్స కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఈ సహాయం చేసినట్లు తెలిపారు.

దంపతులిద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నారని సభ్యుల ద్వారా తెలుసుకుని దాతలు, సభ్యులు, జనహిత అన్నపూర్ణ శాశ్వత అన్నదాతల సహాయంతో విరాళాలు సేకరించి రూ  27 వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. ఆర్థిక సహాయం అందించి ఒక కుటుంబానికి అండగా నిలిచిన దాతలకు జనహిత సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, కోశాధికారి కొడిపెళ్లి గిరిప్రసాద్, గౌరవ సలహాదారులు సేవా రత్న మురుకూరి బాలజీ, సాంబారి నర్సయ్య, కందుల రాజన్న, సింగతి తిరుమల్, పూదరి నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.