బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్...
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో జనహిత స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని బెల్లంపల్లి ఏసీబీ ఏ.రవికుమార్ అన్నారు. బుధవారం స్థానిక గ్రామీణ బస్టాండ్ వద్ద జనహిత ఆధ్వర్యంలో ఏడేళ్లి వాణి, రవికుమార్ దంపతుల కుమారుడు సాయి చరణ్ 23వ జన్మదినం సందర్భంగా చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. జనహిత ఆధ్వర్యంలో 308వ సారి అన్నదాన కార్యక్రమం చేపడుతూ ఉండడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవాసమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కాంపెల్లి విజయ్ కుమార్, గౌరవ సలహాదారులు మురుకూరి బాలాజీ, సభ్యులు కందుల రాజన్న, పూదరి నగేష్ గౌడ్, సాయి, ఈశ్వర్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.