కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్..
జనగామ (విజయక్రాంతి): బాల్య వివాహ రహిత జిల్లాగా జనగామను తీర్చిదిద్దుతామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం బాలల పరిరక్షణ విభాగం, స్కోప్ ఎన్‌జీవో ఆధ్వర్యంలో రూపొందించిన బాల్ వివాహ్ విముక్త్ భౠరత్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎల్.రవికాంత్, పీవోఐసీ స్వప్నారాణి, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, స్కోప్ ఎన్‌జీవో కోఆర్డినేటర్ మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.