calender_icon.png 31 October, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు: పవన్ కళ్యాణ్

15-07-2024 01:36:39 PM

మంగళగిరి: జనసేన ప్రజాప్రతినిధులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. గతంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాలంటే భయం వేసేదన్నారు. ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితి చూశామని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్లమెంట్ సభ్యుణ్ని సంభించి కొట్టించిన తీరు చూశామన్నారు. సుదీర్ఘ అనుభవం, సీఎం పనిచేసిన చంద్రబాబును కూడా జైల్లో పెట్టారని వెల్లడించారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చూశామని పేర్కొన్నారు. ఐదు కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుధ్ది చెప్పారని స్పష్టం చేశారు. జనసేన తరుఫున పోటీచేసిన మొత్తం 21 మందిని గెలిపించారని పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. జనసేన ప్రజా ప్రతినిధులకు సత్కారం చేశారు. పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సత్కార కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా 24 మంది ప్రజా ప్రతినిధులకు సన్మానం చేశారు.