calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటే జానారెడ్డి చరిత్రహీనుడే

14-04-2025 08:27:12 PM

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దొనకొండ రమేష్ 

తుంగతుర్తి: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటే చరిత్రహీనుడైనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దొనకొండ రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... జానారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్ ది అని, జానారెడ్డి మంత్రి పదవుల కోసం లెటర్స్ సిఫార్సు చేయడం సరికాదని విమర్శించారు.

తిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా బరిలో నిలిచి గెలిచారని, తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలో లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డి సతీమణిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడిన చరిత్ర రాజగోపాల్ రెడ్డిది అన్నారు. అధికారంలో లేనప్పుడు జానారెడ్డి పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలని, జానారెడ్డి కుమారుల రాజకీయ లబ్ధి కోసమే పార్టీని వాడుకున్నారే తప్ప కార్యకర్తలను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.