- నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని
- కాచిగూడలో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : తక్కువ ధరకు జెనరిక్ మందులను అందించే ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి యోజన (పీఎంబీజేకే)ను రైల్వే స్టేషన్ల ఆవరణలో ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 18 చోట్ల జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాచిగూడ రైల్వేస్టేషన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జన్ ఔషధి కేంద్రాలను ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ ఆర్‌ఎం లోకేశ్ విష్ణోయ్, ఇతర అధికారులు పాల్గొంటారు.
సమాజంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూడటమే ఈ పథ కం ముఖ్య ఉద్దేశమని ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. నిత్యం లక్షలాది ప్రయాణికులు, సందర్శకులు రైల్వేస్టేషన్లకు వస్తుంటారని, ఈ జనరిక్ ఔషధీ కేంద్రాలు వారికి ఉపయో గంగా ఉంటాయని ఆయన అన్నారు.