ఒక్క విజయం సాధించని తెలంగాణ
హైదరాబాద్: సంతోష్ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సో మవారం జరిగిన మ్యాచ్‌లో జమ్మూ జట్టు 1 తేడాతో రాజస్థాన్‌ను మట్టికరిపించింది. ఇక మరో మ్యాచ్‌లో మణిపూర్ 3 తేడాతో తెలంగాణను మట్టికరిపించింది. జమ్మూకశ్మీర్ గ్రూప్ 11 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు క్వాలిఫై అయింది. జమ్మూ చివరి మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్నా కానీ క్వార్టర్స్‌లో చోటు దక్కించుకునేంది. తెలంగాణ జట్టు 5 మ్యాచ్‌లు ఆడితే ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. 26వ తేదీ నుంచి క్వార్టర్ ఫైనల్స్ జరగనున్నాయి.