న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం ఉదయం ప్రారంభమైన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.65 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లో పది సంవత్సరాల తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో అత్యధికంగా 70.03 శాతం, అత్యల్పంగా పుల్వామాలో 36.90 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
అనంతనాగ్ -46.67%
దోడా - 61.90%
కిష్త్వార్ -70.03%
కుల్గామ్ -50.57%
పుల్వామా -36.90%
రాంబన్ -60.04%
షోపియాన్ -46.84%