calender_icon.png 16 November, 2024 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు: 11 గంటల వరకు 26.72% ఓటింగ్

18-09-2024 11:59:36 AM

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. డు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల వరకు 26.72 శాతం పోలింగ్ నమోదైందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. శ్మీరీ వలస ఓటర్లు అత్యంత భద్రతతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరాలోని పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు తమ ఓటు వేయడానికి ఎదురు చూస్తున్నారు. అనంత్‌నాగ్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పీర్‌జాదా మహ్మద్‌ సయీద్‌, బీజేపీ తరఫున సయ్యద్‌ పీర్జాదా వజాహత్‌ హుస్సేన్‌, పీడీపీ తరఫున మెహబూబ్‌ బేగ్‌ బరిలో నిలిచారు. 

ఏ నియోజకవర్గంలో ఎంత శాతం పోలింగ్

అనంతనాగ్-25.55%

దోడా- 32.30%

కిష్త్వార్-32.69%

కుల్గాం-25.95%

పుల్వామా-20.37%

రాంబన్-31.25%

షోపియాన్-25.96%