న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 90 నియోజకవర్గాలకు గానూ తొలివిడతలో 24 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 7 జిల్లాల్లో తొలి విడత 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కశ్మీర్‌లో 16, జమ్మూలో 8 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్‌లో 23.27 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అక్టోబర్ 8న జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.