23-03-2025 12:00:00 AM
మేడ్చల్, మార్చి 22 (విజయ క్రాంతి): 72 ఏళ్ల వయస్సులో పార్టీ మారే ప్రసక్తే లే దని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో కలిసి ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు, నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల గురించి కలిశానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయడానికి తమ కుటుంబంలో నలుగురు సిద్ధంగా ఉన్నార న్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలే ప్రస్తుతం పరేషాన్‌లో ఉన్నారన్నారు.