calender_icon.png 6 April, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2034 తర్వాతే జమిలి

06-04-2025 12:49:25 AM

నిర్మలా సీతారామన్

చెన్నై, ఏప్రిల్ 5: జమిలి ఎన్నికలు 2034 తర్వాతే నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ సెమినార్‌లో ఆమె మాట్లాడు తూ.. ‘2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపు లక్ష కోట్లు ఖర్చ య్యాయి. జమిలి ఎన్నికలతో ఈ వ్యయం తగ్గుతుంది.

పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ఖర్చు తగ్గుతుంది. దేశ జీడీపీలో 1.5 శాతం మేర పెరుగుదల కనిపిస్తుంది. 2034 తర్వాతే వీటిని అమలు చేస్తాం.’ అని అన్నారు. జమిలి ప్రయోజనాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.