calender_icon.png 18 January, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

17-12-2024 01:08:29 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు 129వ రాజ్యంగ సవరణ బిల్లుగా ఈ బిల్లును కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ కోసం కేంద్రం రెండు బిల్లులను సిద్ధం చేసింది. జమిలి ఎన్నికల బిల్లుపై లోక్ సభలో చర్చ కొనసాగుతుంది. కానీ విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. 

కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్(ఐయూఎంఎల్), శివసేన (యూబీటీ) బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.  ఈ బిల్లు ఓటు హక్కుపై దాడి చేయడమేనని కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ వ్యతిరేకించారు. ఈ బిల్లును జేపీసీకి పంపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.