10-02-2025 01:41:04 AM
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి ౯ ః కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహ అధ్యక్షులు, ఎల్లారెడ్డి నివాసి జమీల్ హైమద్ ఆదివారం నాడు జాతీయ సేవా పురస్కారం అవార్డు అందుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూనే 27 సార్లు రక్తదానం చేసి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించి ఆదుకోవడంతోపాటు పలుమార్లు రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్తదాతలకు అవగాహన కల్పిస్తున్నందుకు తన సేవలను గుర్తించి జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహించిన జాతీయ సేవా పురస్కారం 2025 కార్యక్రమంలో చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు,ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ రెడ్డి చేతుల మీదగా ఉత్తమ సేవా పురస్కారం అందించారని అన్నారు. తనకు సహకరించి ఈ అవకాశాన్ని కల్పించిన కామారెడ్డి రక్తదాతల సమూహానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.