09-03-2025 01:04:10 PM
పాకిస్థాన్,(విజయక్రాంతి): జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం సభ్యుడు ముఫ్తీ షా మీర్ హత్యకు గురయ్యారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరులు ఉపవాసంలో భాగంగా ముఫ్తీ షా మీర్ ప్రార్థనలు ముగించుకొని వెళ్తున్న దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో ఉలేమా-ఇ-ఇస్లాం సభ్యుడు ముఫ్తీ షా మీర్ మృతి చెందాడు. ఉగ్రసంస్థలు భారత్ లోకి వచ్చేందుకు ముఫ్తీషా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కిడ్నాప్ అయ్యేందుకు ముఫ్తీషా ఐఎస్ఐకు సహకరించారు. 2016లో కుల్ భూషణ్ జాదవ్ ను ఇరాన్ లో పాక్ ఏజెంట్లు అపహరించడంతో ఆయనకు 2017లో పాక్ సైనిక్ కోర్టు మరణశిక్ష విధించింది. కుల్ భూషణ్ కు పాక్ కోర్టు విధించిన మరణశిక్షను భారత్ ఐసీజేలో సవాలు చేయడంతో విచారణ కొనసాగుతోంది.