calender_icon.png 17 October, 2024 | 2:45 PM

జీవన భృతి కల్పించిన జమాతే ఇస్లామీ హింద్

17-10-2024 12:26:16 PM

హుజూర్ నగర్, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని NSP క్యాంప్, శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న షేక్ యూసుఫ్ బీ భర్త లేట్ షేక్ అబ్దుల్లా  అనారోగ్య కారణం చేత అవస్థలు పడుతున్న ఆమె కుటుంబ పరిస్థితిని, వారి ఆర్ధిక బాధలను తెలుసుకొని గురువారం జమాతే ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షుడు మ్యారేజ్ బ్యూరో మజీద్ భాయ్ జమాతే ఇస్లామి హింద్ సంస్థ జిల్లా ప్రతినిధులతో మాట్లాడి వారి జీవన భృతికై ఒక తోపుడు బండితో పాటు హోటల్ నడుపుకొనుటకు అవసరమగు సామాగ్రిని వారికి అందజేసారు. ఈ కార్యక్రమంలో నవాబ్ జాని, ఉస్మానియా మస్జీద్ మౌజన్ మహమ్మద్ సిరాజ్ భాయ్ పాల్గొన్నారు. షేక్ యూసుఫ్ బీ కుటుంబ జీవన భృతి కొరకు జమాతే ఇస్లామి హింద్ సంస్థ సాయం అందించడం పట్ల స్థానిక ముస్లిం సోదరులు,ముస్లీం పెద్దలు సంస్థ పట్టణ అధ్యక్షుడు మ్యారేజ్ బ్యూరో మజీద్ భాయ్ ని అభినందించారు.