హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగర నీటిసరఫరా, మురుగునీటి పారుదల సంస్థ (హెచ్‌ఎండ బ్యూఎస్‌ఎస్‌బీ) జలమండలి అధికారిక వెబ్‌సైట్‌ను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం హ్యాక్ చేశారు. దీంతో బిల్లులు కట్టేందుకు ప్రయత్నించిన వినియోగదారు లకు వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు.
ఓ పక్క ఓటీఎస్ (వన్‌టైం సెటిల్‌మెంట్) ద్వారా పెండింగ్ బిల్లులు వసూలు చేస్తున్న వేళ సైబర్ కేటుగాళ్లు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడంతో అధికారులు, నగరవాసుల్లో గందరగోళం నెలకొంది. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ గేమ్స్ వైపు వినియోగదారులను మళ్లించినట్లు సమాచారం. జలమండలి అధికారులు స్పందించాల్సి ఉంది.